శివ పంచాక్షరీ స్తోత్రము
నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమశ్శివాయ ...1
మందాకినీ సలిల చందన చర్చితాయ
నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ
మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ
తస్మై మకారాయ నమశ్శివాయ ...2
శివాయ గౌరీ వదనారవింద-
సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీల కంఠాయ వృషధ్వజాయ
తస్మై శికారాయ నమశ్శివాయ ...3
వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది
మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానర-లోచనాయ
తస్మై వకారాయ నమశ్శివాయ ...4
యజ్ఞ స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై యకారాయ నమశ్శివాయ ...5
ఫలశృతి
పంచాక్షర-మిదం పుణ్యం
యః పఠేత్ శివ సన్నిధౌ
శివలోక-మవాప్నోతి
శివేన సహ మోదతే
అర్ధము:
1. నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులు కలవాడు, భస్మము ఒంటి నిండా పూసుకున్న వాడు, మహేశ్వరుడు నిత్యమైన వాడు, పరిశుద్ధుడు, దిగంబరుడు, ‘నమః శివాయ’ అను మంత్రము నందు ‘న’ అను అక్షరమైన శివునకు నమస్కారము.
2. ఆకాశగంగా జలమనే చందనము పూయబడినవాడు, నందీశ్వరుడు మొదలైన ప్రమధ గణములకు నాయకుడు, మందారము మొదలైన అనేక పుష్పములచే పూజింప బడిన వాడు ‘నమః శివాయ’ అను మంత్రము నందు ‘మ’ అను అక్షరమైన శివునకు నమస్కారము.
3. మంగళకరుడు, పార్వతీ ముఖమనే పద్మ సముదాయమును వికసింపచేయు సూర్యుడు, దక్షుని యాగము నాశనం చేసినవాడు, నల్లని కంఠము కలవాడు, జండాపై ఎద్దు చిహ్నమున్నవాడు, ‘నమః శివాయ’ అను మంత్రము నందు ‘శి’ అను అక్షరమైన శివునకు నమస్కారము.
4. వసిష్టుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలైన మునీంద్రుల చేత పూజింపబడు వాడు, జటాజూటము కలవాడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని మూడు కన్నులుగా కలవాడు, ‘నమః శివాయ’ అను మంత్రము నందు ‘వ’ అను అక్షరమైన శివునకు నమస్కారము.
5. యక్ష స్వరూపుడు, జటలను ధరించిన వాడు, పినాకము అను ధనుస్సును చేతిలో పట్టుకున్నవాడు, సనాతనుడు, ఆకాశమునందుండు దేవుడు, దిగంబరుడు, ‘నమః శివాయ’ అను మంత్రము నందు ‘య’ అను అక్షరమైన శివునకు నమస్కారము.
ఫలశృతి:
పావనమైన ఈ పంచాక్షర స్తోత్రము ఎవరు శివ సాన్నిధ్యం లో స్తుతిస్తారో వారికి శివలోక ప్రాప్తి కలిగి, శివుని అనుగ్రహం పొందుదురు.
Ramakrishna Duvvu
You tube channel :
https://www.youtube.com/channel/UCUdmnDUdMQODIPTuV0VXEew